Wednesday, 18 March 2026

నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఉచిత కంటి వైద్య శిబిరం

నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం💥

సిద్దిపేట జిల్లా TNGOs ఆధ్వర్యంలో, డా. అగర్వాల్ ఐ హాస్పిటల్ సహకారంతో నీటిపారుదల శాఖ ఉద్యోగుల కోసం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం (23-12-2025) విజయవంతంగా ముగిసింది. సిద్దిపేట సర్కిల్ ఆఫీస్, పల్లగుట్టలో ఉదయం 10:30 గంటల నుండి నిర్వహించిన ఈ శిబిరానికి నీటిపారుదల శాఖకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.
ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగిన వైద్య సలహాలు, సూచనలు అందించారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉద్యోగుల నుండి మంచి స్పందన లభించింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డా. అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్య బృందానికి, అలాగే సహకరించిన నీటిపారుదల శాఖ అధికారులు, ఉద్యోగులకు TNGOs సిద్దిపేట జిల్లా కార్యదర్శి కోమండ్ల విక్రం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Friday, 13 March 2026

ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లు మరియు విభిన్న సమస్యలపై

ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లు మరియు విభిన్న సమస్యలపై చర్చించేందుకు TNGOs నాయకులు మారం జగదీశ్వర్, ముజీబ్ గారు సోమవారం ఇరిగేషన్ ఇంజనీర్–ఇన్–చీఫ్ (అడ్మిన్) శ్రీ రమేష్ బాబు గారిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఉద్యోగుల పదోన్నతులు, ఖాళీ స్థానాల భర్తీ, సేవా సమస్యలు వంటి అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని రమేష్ బాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.కార్యక్రమం లో సిద్దిపేట తరపున TNGO సిద్దిపేట తరపున శ్రీ కోమాండ్ల విక్రమ్ రెడ్డ, శ్రీ ఆంజనేయులు, TINGO ప్రెసిడెంట్ ఇతరులు పాల్గొన్నారు


నీటిపారుదల శాఖ సమస్యల మీద

సిద్ధిపేటలో జరిగిన TNGO సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు నీటిపారుల శాఖ పల్లగుట్టకు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ సమస్యలను విస్తృతంగా పరిశీలించారు.




సమావేశంలో మాట్లాడుతూ 2021లో జరిగిన Reorganisation కారణంగా జూనియర్ అసిస్టెంట్లు ఇతర జిల్లాలకు బదిలీ చేయడం వలన వారికి గణనీయమైన నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గజ్వెల్ యూనిట్‌లో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే అమలు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. గజ్వేల్ యూనిట్లో పదోన్నతులు ఇవ్వకపోవడం ద్వారా చాలా ఇబ్బందులకు ఉద్యోగస్తులు గురవుతున్నారని అతి త్వరలో పదోన్నతులు కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది

అలాగే PAO వద్ద పెండింగ్ బిల్లులను వేయించామని, అవి త్వరగా క్లియర్ కావడానికి సంఘం తరఫున ప్రస్తుతానికి ఫాలోఅప్ జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన Festival Advance, TGLI వంటి Loans & Advances చెల్లింపులను కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఉద్యోగులకు క్రమశిక్షణ, సంఘ కట్టుబాటు చాలా కీలకమని స్పష్టం చేసిన శ్రీ మారం జగదీశ్వర్ గారు, ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా బయట ఎక్కడా మాట్లాడకుండా తప్పనిసరిగా సంఘం ద్వారానే పరిష్కారం చేసుకోవాలని సూచించారు. సంఘ నియమాలు, కట్టుబాట్లు ఉల్లంఘించినట్లయితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

కారుణ్య నియామకాల విషయంలో సూపర్న్యూమరి పోస్టులు ఖాళీ అయిన వెంటనే వాటిలో నియామకాలు జరగాలి. అలాగే ఉద్యోగ నియామకం అయిన తేదీ తప్పకుండా విధివిధానాల ప్రకారం నమోదు చేయాలని కోరారు.

సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభించేలా సంఘం అత్యున్నత స్థాయిలో కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఉద్యోగులు అందరూ తన సొంత శాఖ మనుషులని వారికి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత సంఘంపై కూడా ఉందని కష్టం వస్తే జిల్లా అధ్యక్షులు కలవాలని సూచన చేయడం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్ర అధ్యక్షులు పల్లెగుట్టకు రావడంపై ఉద్యోగస్తులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది

ఈ సమావేశంలో సిద్ధిపేట జిల్లా TNGO కార్యదర్శి శ్రీ కోమాండ్ల విక్రమ్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

Siddipet IRRIGATION SECRETARY POST

Honoured with SIDDIPET District Irrigation Secretary on 10.03.2026 at ENC(Admn), Hyderabad Calender program 2026 with TNGO UNION President Sri Maram Jagadishwar Garu, Sri Laxman garu(Irrigation Central forum President) and Sri Vikram Reddy garu(TNGO Siddipet district Secretary).

Thursday, 12 March 2026

పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల విషయంపై

ఈ రోజు TNGO సిద్ధిపేట కార్యదర్శి కోమండ్ల విక్రం రెడ్డి చీఫ్ ఇంజనీర్ (ఇరిగేషన్) గజ్వెల్ గారిని కలిసి యూనిట్‌లో జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్‌కు పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల విషయంపై చర్చించడం జరిగింది. దీనిపై CE గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అలాగే 132 – ఆఫీస్ ఎక్సపెన్సెస్ అంశాన్ని కూడా ప్రస్తావించగా, దానిని ENC జనరల్ గారి దృష్టికి తీసుకెళ్తామని CE గారు హామీ ఇచ్చారు.

ఇక సూపర్‌న్యూమరరీ పోస్టుల క్లారిఫికేషన్ విషయాన్ని కూడా త్వరగా పరిష్కరించాల్సిందిగా CE గారిని కోరడం జరిగింది.

అదేవిధంగా ఆఫీస్‌లో కంప్యూటర్లు, ప్రింటర్లు సరైన స్థితిలో లేవని, వాటిని కూడా త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరడం జరిగింది.

ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సిద్దిపేట జిల్లా కార్యదర్శి శ్రీ శ్రీరాంభట్ల సచిన్, శ్రీ మాదిశెట్టి అరవింద్, శ్రీ మణి శంకర్ పాల్గొన్నారు.