Monday, 8 December 2025

పెండింగ్ లో ఉన్న DA ల విడుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని

సిద్దిపేట: పెండింగ్ లో ఉన్న DA ల విడుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని TNGO నాయకులను కోరిన ప్రభుత్వ ఉద్యోగులు

సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న డి.ఎ.లు విడుదలకు కృషి చేయాలని TNGO నాయకులను కోరారు. కనీసం రెండు DA ల విడుదలకు చర్యలు తీసుకోవాలని, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారానికీ నాయకత్వం వహించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన TNGO సీక్రటరీ కోమాండ్ల విక్రమ్ రెడ్డి, సమస్యలను TNGO సెంట్రల్ యూనియన్ దగరికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.



ఇరిగేషన్ శాఖలో ఉద్యోగులకు Presidential Order 2018


ఇరిగేషన్ శాఖలో ఉద్యోగులకు Presidential Order 2018 అమలులో అవకాశం ఇవ్వకుండా, కుటుంబాలకు దూరంగా, ఇస్తానుసార పోస్టింగ్‌లు ఇవ్వడం వంటి అన్యాయాన్ని సవాలుగా నిలుపుతూ — TGPSC ద్వారా నియమితులై అన్యాయంగా బాధితులైన ఉద్యోగుల సమస్యను TNGO సిద్ధిపేట యూనిట్ పూర్తి బాధ్యతతో TNGO సెంట్రల్ యూనియన్‌కు అధికారికంగా వినతిపత్రం అందజేసింది. ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ ENC (అడ్మిన్) గారికి తెలియజేసి, నష్టపోయిన ఉద్యోగులకు ఎంపిక (options) ఇచ్చేలా పునఃసమీక్ష చేసి, వారి వారి సొంత జిల్లాలకు పంపించేలా న్యాయం చేయాలని ఈ రోజు గట్టిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.

ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లు మరియు విభిన్న సమస్యలపై

ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్లు మరియు విభిన్న సమస్యలపై చర్చించేందుకు TNGOs నాయకులు మారం జగదీశ్వర్, ముజీబ్ గారు సోమవారం ఇరిగేషన్ ఇంజనీర్–ఇన్–చీఫ్ (అడ్మిన్) శ్రీ రమేష్ బాబు గారిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఉద్యోగుల పదోన్నతులు, ఖాళీ స్థానాల భర్తీ, సేవా సమస్యలు వంటి అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని రమేష్ బాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.కార్యక్రమం లో సిద్దిపేట తరపున TNGO సిద్దిపేట తరపున శ్రీ కోమాండ్ల విక్రమ్ రెడ్డ, శ్రీ ఆంజనేయులు, TINGO ప్రెసిడెంట్ ఇతరులు పాల్గొన్నారు


నీటిపారుదల శాఖ సమస్యల మీద

సిద్ధిపేటలో జరిగిన TNGO సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు నీటిపారుల శాఖ పల్లగుట్టకు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ సమస్యలను విస్తృతంగా పరిశీలించారు.




సమావేశంలో మాట్లాడుతూ 2021లో జరిగిన Reorganisation కారణంగా జూనియర్ అసిస్టెంట్లు ఇతర జిల్లాలకు బదిలీ చేయడం వలన వారికి గణనీయమైన నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గజ్వెల్ యూనిట్‌లో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే అమలు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. గజ్వేల్ యూనిట్లో పదోన్నతులు ఇవ్వకపోవడం ద్వారా చాలా ఇబ్బందులకు ఉద్యోగస్తులు గురవుతున్నారని అతి త్వరలో పదోన్నతులు కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది

అలాగే PAO వద్ద పెండింగ్ బిల్లులను వేయించామని, అవి త్వరగా క్లియర్ కావడానికి సంఘం తరఫున ప్రస్తుతానికి ఫాలోఅప్ జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన Festival Advance, TGLI వంటి Loans & Advances చెల్లింపులను కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఉద్యోగులకు క్రమశిక్షణ, సంఘ కట్టుబాటు చాలా కీలకమని స్పష్టం చేసిన శ్రీ మారం జగదీశ్వర్ గారు, ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా బయట ఎక్కడా మాట్లాడకుండా తప్పనిసరిగా సంఘం ద్వారానే పరిష్కారం చేసుకోవాలని సూచించారు. సంఘ నియమాలు, కట్టుబాట్లు ఉల్లంఘించినట్లయితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

కారుణ్య నియామకాల విషయంలో సూపర్న్యూమరి పోస్టులు ఖాళీ అయిన వెంటనే వాటిలో నియామకాలు జరగాలి. అలాగే ఉద్యోగ నియామకం అయిన తేదీ తప్పకుండా విధివిధానాల ప్రకారం నమోదు చేయాలని కోరారు.

సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభించేలా సంఘం అత్యున్నత స్థాయిలో కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఉద్యోగులు అందరూ తన సొంత శాఖ మనుషులని వారికి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత సంఘంపై కూడా ఉందని కష్టం వస్తే జిల్లా అధ్యక్షులు కలవాలని సూచన చేయడం జరిగింది చాలా సంవత్సరాల తర్వాత రాష్ట్ర అధ్యక్షులు పల్లెగుట్టకు రావడంపై ఉద్యోగస్తులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది

ఈ సమావేశంలో సిద్ధిపేట జిల్లా TNGO కార్యదర్శి శ్రీ కోమాండ్ల విక్రమ్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

Tuesday, 2 September 2025

CPS ధర్నాలో నీటిపారుదల శాఖ ఉద్యోగులు





1st September 2025 రోజు సిద్దిపేట డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఎదురుగా జరిగిన ధర్నాలో నీటిపారుదల శాఖ ఉద్యోగులు CPS (Contributory Pension Scheme) రద్దు చేసి, మళ్లీ OPS (Old Pension Scheme) అమలు చేయాలని డిమాండ్.

Sunday, 31 August 2025

పెన్షన్ విద్రోవ దినాన్ని పురస్కరించుకొని ✊

సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ విద్రోవ దినాన్ని పురస్కరించుకొని నీటిపారుదల శాఖలో పల్లగుట్ట రంగనాయక సాగర్ ఈరోజు గోడపత్రికను ఆవిష్కరణ చేయడం జరిగింది




Sunday, 6 July 2025

టిఎన్జిఓస్ నీటిపారుదల సిద్ధిపేట శాఖ

*శ్రీ రంగనాయక సాగర్‌కు విచ్చేసిన మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారు మరియు దుబ్బాక శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని టిఎన్జిఓస్ నీటిపారుదల సిద్ధిపేట శాఖ పక్షాన మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.*




Tuesday, 20 May 2025

సిద్దిపేట: పెండింగ్ లో ఉన్న DA ల విడుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని TNGO నాయకులను కోరిన ప్రభుత్వ ఉద్యోగులు

సిద్దిపేట: పెండింగ్ లో ఉన్న DA ల విడుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని TNGO నాయకులను కోరిన ప్రభుత్వ ఉద్యోగులు




సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న డి.ఎ.లు విడుదల కు కృషి చేయాలని TNGO నాయకులను కోరారు. కనీసం రెండు DA ల విడుదలకు చర్యలు తీసుకోవాలని, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారానికీ నాయకత్వం వహించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన TNGO సీక్రటరీ కోమాండ్ల విక్రమ్ రెడ్డి, సమస్యలను TNGO సెంట్రల్ యూనియన్ దగరికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Wednesday, 22 January 2025

తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు!


తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చేయడం జరిగింది (ఫిబ్రవరి 13, 2014)

ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు!!




29.03.2022 ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిలుపు మేరకు ఈనెల 28 & 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జనపదల పెట్టిన సమ్మెకు TNGO సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మేము సైతం అంటున్న నీటిపారుదల శాఖ సిద్దిపేట ఉద్యోగులు.

నూతన PRC లో జూనియర్ అసిస్టెంట్స్ పే స్కేల్స్!!



3, ఫిబ్రవరి, 2024 రోజు శ్రీ మారం జగదీశ్వర్ TNGO, ప్రెసిడెంట్ గారిని కలిసి జూనియర్ అసిస్టెంట్స్ సమస్యలు తెలుపడం జరిగింది, అలాగే నూతన PRC లో జూనియర్ అసిస్టెంట్స్ పే స్కేల్స్ పెంచవలసిందిగా వినతి పత్రము ఇవ్వడము జరిగింది, శ్రీ మారం జగదీశ్వర్ గారు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీస్కుంటామని హామీ ఇచ్చారు త్వరలో మరో సారి అందరిని పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు, సమావేశం లో S.ఈశ్వరయ్య,సూపరింటెండెంట్,శ్రీ శ్రీరాంభట్ల సచిన్,JA శ్రీ మణికంఠ, JA, శ్రీ తరుణ్,JA మరియు ఇతర జూనియర్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.